22-09-2025 12:27:45 AM
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మన బతుకుదెరివే వ్యవసాయమని వ్యవసాయం లేనిది మనకు జీవన ఉపాధి లేదని మాజీ మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ విగ్రహావిష్కరణ ఘనంగా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైన కర్ణాటకలో కట్టిన బ్యారేజీలు డ్యామ్ వల్ల.. పోతిరెడ్డిపాడు బోక్క పెట్టడం వల్ల అక్రమంగా నీళ్లు తీసుకుపోతున్నారు..ఎండాకాలంలో కృష్ణానది పూర్తిగా ఎండిపోయిందని, టోటల్గా నీళ్ళు రాకుండా అయిపోయిందన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల దాదాపు ల క్షల ఎకరాల భూమిని సేకరించి..ఇప్పుడున్న ఎందుకంటే 100 టీఎంసీల నీళ్లు అదనంగా నిలిపే విధంగా..
దీన్ని నిర్మిస్తున్నారు.. ఇది గనక పూర్తయితే..కృష్ణ వాటర్ బోర్డు తేల్చకముందే .. ట్రిబ్యునల్ తీర్పు రాకముందే.. ఎగువన ఉన్న రాష్ట్రాలు ఎక్కడికక్కడ నీళ్లు తీసుకుపోతే.. మహ బూబ్నగర్లో బతకాల వద్ద అనే పరిస్థితి వస్తుందన్నారు. ఆల్మట్టి ఎత్తు పై పార్టీలకు అతీతంగా అం దరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అవసరమైతే కేంద్రంతో.. ఢి ల్లీకి పోయి ఆందోళనకు సిద్ధం కావాలి..
రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతమన్నారు. పాలమూరు కు జాతీయ హోదా ఇవ్వకపోగా ఎగువ రాష్ట్రాలు ఎక్కడికి అక్కడే ప్రాజెక్టులు కడితే పాలమూరు ఏమైపోవాలని ప్రశ్నించారు. దీన్ని అడ్డుకోకపోతే మొత్తం ఎడారిగా మారాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. మా ప్రభుత్వ హాయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాల్సింది బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మీరు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేయలేదా? ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసేలా చర్యలు ఉండాలని కోరారు. ఈ సమావేశం లో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి చిట్టెం రామ్మోహన్ రెడ్డి అంజయ్య యాదవ్ పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సలీం తదితరులు పాల్గొన్నారు