calender_icon.png 22 September, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టిలో మాణిక్యం..

22-09-2025 12:26:20 AM

  1. ఎంబీబీఎస్ సీటును సాధించిన హర్షిత 

తండ్రి కలలు నెరవేరాయి 

గోపాలపేట ఆణిముత్యం 

గోపాలపేట సెప్టెంబర్ 21: ఓ తండ్రి కలలను నెరవేర్చేందుకు ఎంతో కృషి సంక ల్పంతో ప ట్టు పట్టి పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన మట్టిలో మాణిక్యం గోపాలపేట ఆణిముత్యం వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రానికి చెందిన హర్షిత ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సాధించింది. గోపాలపేట మం డల కేంద్రానికి చెందిన బొల్లి రాజేందర్ ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో నివాసం ఉండేవాడు.

తాను అనారోగ్యంతో మృతి చెందాడు. తన కూతురు నీ బాగా చదివించి డాక్టర్ చేయాలన్న కలలు నెరవేరక ముందే అనారోగ్యంతో తండ్రి రాజేందర్ మృతి చెందాడు. ఆయన నా తండ్రి కన్న కల నెరవేరుస్తానని హర్షిత పట్టుదలతో చదవ సాగింది. హైదరాబాద్ సూరారం లో ఉంటున్న హర్షిత ఐదవ తరగతి ఓ ప్రైవేట్ స్కూల్లో చదువు 6 నుండి 10వ తరగతి వరకు మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో చదువు కుంది.

హర్షిత పదవ తరగతిలో మంచి ఫలితాలను సాధించింది. ఇంటర్మీడియట్ కూడా గురుకులం కళాశాలలో చదువుకుంటూ. ఇటీవల వెలువడిన నీటి ఫలితాల్లో హర్షిత ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీట్ సాధించింది. ఎస్ ఎస్ సి లో 10/10 జీపీఏ, ఇంటర్మీడియట్ బైపీసీలో 963 మార్కులు సాధించింది నీట్ ఆల్ ఇండియా ర్యాంకులో 85 321 ర్యాంక్ సాధించి స్టేట్ ర్యాంక్ 11011 ర్యాంకు తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించిన గోపాల్పేట మంచి పేరును తీసుకొచ్చింది దీంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు హర్షితను అభినందించారు.