26-11-2025 12:00:00 AM
కిమ్స్ ఆస్పత్రిలో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): దేశంలోనే ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన కిమ్స్ ఆస్పత్రి ఏఐ ఆధా రిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఆవిష్కరించింది. దీనివల్ల ప్రధానంగా ఇన్పేషెంట్లు చికిత్సలకు ఎలా స్పందిస్తున్నారో అన్న విష యం తెలియడంతో పాటు ప్రతి ఒక్క పేషెం ట్ భద్రత గణనీయంగా పెరుగుతుంది. ఈ సరికొత్త వ్యవస్థతో రోగుల కీలక పారామీటర్లు అన్నింటినీ నిరంతరం రిమోట్గానే పర్య వేక్షించేందుకు వీలుంటుంది.
ఇందుకు వైర్లెస్ వేరబుల్ పరికరాలను ఉపయోగిస్తారు. రో గుల పరిస్థితి ఏమైనా మారగానే వెంటనే క్లినికల్ బృందాలకు రియల్ టైంలో ఎలర్టులు వెళ్తాయి. వారు తక్షణం పరిస్థితిని నర్సింగ్, మెడికల్ సిబ్బందికి తెలియజేసి పూర్తి సమన్వయంతో వెంటనే తగిన చికిత్స అంది స్తారు. దీనివల్ల రోగుల సేఫ్టీ ప్రొటోకాల్ మ రింత పటిష్ఠం అవుతుంది.
కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండి డా. భాస్కర్ రావు మాట్లాడుతూ.. ‘ఆగ్మెంట్ రియాలిటీ అసిస్టెడ్ న్యూరోసర్జరీ, అత్యాధునిక ఇమేజింగ్ సిస్టం లు, ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్స్, రోగుల అనుభవాలను పెంచే డిజిటల్ ప్లా ట్ఫాంలు ఉన్నాయి. ఇప్పుడు ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను కూడా చేర్చడంతో రోగుల పరిస్థితిని నిరంతరం గమనించడానికి, రోగి బెడ్ వద్దే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది’ అన్నారు.