calender_icon.png 26 November, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

26-11-2025 12:00:00 AM

3245  మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ

చేవెళ్ల, నవంబర్ 25( విజయక్రాంతి): మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలలో  వడ్డీ లేని రుణాలు ఒకటని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య  అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్,  మొయినాబాద్ మండలలకు చెందిన 3245  మహిళా సంఘాలకు రూ. 3 కోట్ల 69 లక్షల 21 వేల 7 వందల 62లు వడ్డీలేని రుణాలను పంపి ణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కాలే యాదయ్య మాట్లాడుతూ.. మన గ్రామాల్లో, పట్టణాల్లో చిన్న వ్యాపారాలు చేసే వారు, కూలి జీవనం సాగించే వారు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలుఇవాళ్టికి కూడా అధిక వడ్డీ రేట్లకు అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనందరికీ తెలుసు. అదే సమయంలో, చిన్న వ్యాపారాన్ని పెద్దగా మార్చే శక్తి ఉన్నా, ఆర్థిక సాయం లేనందువల్ల ఎంతో మంది వెనుకబడిపోతుంటారు.

ఈ పరిస్థితులను మార్చేందుకు&ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం, వడ్డీ లేని రుణా లు ప్రభుత్వం అందిస్తున్నారని... ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా వృద్ధులోకి రావాలని కోరారు. గ్రామానికి, ప్రతి సంఘా అభిద్రకళ,  జిల్లా గ్రంధాలయం చైర్మన్ మధు సుదన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,  మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు,  కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.