calender_icon.png 16 May, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెకు ఏఐకేఎంఎస్ మద్దతు

16-05-2025 01:05:55 AM

మహబూబాబాద్, మే 15 (విజయ క్రాంతి): కార్మిక సంఘాలు ఈనెల 20న ఇచ్చిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ తెలిపారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఆఫీసు బేరర్ సమావేశం మహబూబాబాద్ పట్టణంలోని బట్టు అంజయ్య స్మారక భవనంలో జిల్లా అధ్యక్షులు బండారి ఐలయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మూడు విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈనెల 16 నుండి 19వరకు అన్ని గ్రామాలలో సంఘం  ఆధ్వర్యంలో  విస్తృతంగా ప్రచారం నిర్వహించి సంఘీభావం తెలపాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు మైనం యాకయ్య, సక్రు, యాదగిరి, యుగంధర్, గజ్జి లింగన్న, ఎస్కే తాజ్ పాషా పాల్గొన్నారు.