calender_icon.png 16 May, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు దళ సభ్యుడు మృతి

16-05-2025 01:02:13 AM

  1. ములుగు జిల్లా వాసిగా గుర్తింపు

ఆలస్యంగా కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగింత 

సాధనపల్లిలో దివంగత నక్సలైట్ రవి అంత్యక్రియలు 

మహబూబాబాద్, మే 15 (విజయక్రాంతి): చత్తీస్గడ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఈనెల 6న జరిగిన కాల్పుల్లో ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం సాధనపల్లి చందు@ నీరజ్, రవి (25) మరణించాడు. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన పోలీసులు చందు మృతదేహాన్ని గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎన్కౌంటర్ మృతుల వివరాలు తెలియకపోవడంతో మృతదేహాలను చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

ఇక్కడి పోలీసులకు ఎన్కౌంటర్ మృతుల ఫోటోలను పంపించగా, ఆ ఫోటోల ఆధారంగా సేకరించిన సమాచారం మేరకు చందుగా నిర్ధారించడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామానికి చెందిన రవి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కారు నడుపుకుంటూ హైదరాబాదులో తన అన్న వద్ద ఉంటున్నాడు.

ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తిచేసి ప్రైవేట్ ల్యాబ్ లో పనిచేసి తరువాత కొన్నాళ్లు భద్రాచలంలో కూడా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం మావోయిస్టులతో పరిచయం ఏర్పడి అడవి బాట పట్టినట్టు భావిస్తున్నారు.

అజ్ఞాతంలోకి వెళ్లిన చందు ఎన్కౌంటర్ లో మరణించడం పట్ల గ్రామం లో విషాదం నెలకొంది. కొడుకు అకాల వృత్తి వాత పడడంతో తల్లి అన్నపూర్ణ కన్నీరు మున్నీరుగా విలపించింది. గురువారం చందు అంత్యక్రియలు గ్రామంలో నిర్వహించారు.