11-09-2025 01:31:01 AM
-ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి
-లోయర్ ట్యాంక్బండ్‌లో ఐలమ్మ 40వ వర్ధంతి
-పాల్గొన్న ముషీరాబాద్, షాద్ నగర్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వీర్లపల్లి శంకర్
ముషీరాబాద్, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, శంషాబాద్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణ రజక (దోభి) అభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం. నరసింహ ఆధ్వర్యంలో బుధవారం లోయర్ ట్యాంక్ బండ్ లో ని సంస్థ కార్యాలయం వద్ద గల వీరనారి సాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహలు హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నిజాం రజాకార్ల కాలంలో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు.
ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. రజకులు తమ హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. రజకుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ బొమ్మరాజా కృష్ణమూర్తి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ మందలపు గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి సుక్కన్న, రాష్ట్ర మహిళా చైర్మన్ బండారు జ్యోతి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బండిరాల చంద్రమోహన్, పొట్టి పోచల కిషన్, శ్రీధర్, ఎ. సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ చీమల అశోక్, గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ అంబాటి అశోక్, సిహెచ్ రాములు, స్థానిక దోబీ ఘాట్ అధ్యక్షులు ఆందోల్ సాయి సత్యనారాయణ, బీఆర్‌ఎస్ నేతలు వల్లాల శ్యామ్ యాదవ్, రవి యాదవ్, శ్రీహరి తోపాటు రజక అభివృద్ధి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.