11-09-2025 01:29:53 AM
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
చిన్నశంకరంపేట (మెదక్), సెప్టెంబర్ 10 :పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ అండగా ఉందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. బుధవారం చిన్నశంకరంపేట మండలంలో రైతు వేదికలో కళ్యాలక్ష్మి, షాది ముబారక్ 39 చెక్కులను లబ్దిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 33 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 06 చెక్కులు ద్వారా 39 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు. మహిళలు ఈ డబ్బులను వృథా చేయకుండా అవసరానికి వినియోగించుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, వివిధ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.