calender_icon.png 29 January, 2026 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలు

29-01-2026 12:53:23 AM

న్యూఢిల్లీ, జనవరి ౨౮: ఎన్నికల ప్రచారాలు, అధికారిక కార్యక్రమాలకు వెళ్తూ గతంలోగడిచిన ౫౦ ఏళ్లలో ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సినీ తారలు విమాన ప్రమాదంలో  మృతిచెందారు.

వీరిలో అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ బాబా, సంజయ్‌గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్రావ్ సింధియా, నాటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, సినీతార సౌందర్య, పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్, నాటి మంత్రి సురీందర్ సింగ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందారు. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్‌రావత్ విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఇవే ఘట నల్లో వారితో కలిసి ప్రయాణించిన కొందరు కూడా మృతిచెందారు.