calender_icon.png 29 January, 2026 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్సీపీ పగ్గాలు సునేత్ర పవార్ చేతికేనా?

29-01-2026 12:55:11 AM

మంబై, జనవరి ౨౮: అజిత్ పవార్ మరణం ఎన్సీపీలో పెద్ద వెలితి నింపింది. ఒక్కసారిగా ఆ పార్టీని శూన్యం ఆవహించింది. ఆయన తర్వాత ఇప్పుడు పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారనే చర్చ మొదలైంది. ఈ నేపథయలో అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్‌పైనే పడింది. సునేత్ర కేవలం అజిత్‌పవార్ సతీమణిగానే కాకుండా, ఇప్పటికే రాజకీయాల్లో తనదైన గుర్తింపు సాధించారు.

ఆమె రాజకీయ నేపథ్యం ఎంతో బలమైంది. ఆమె మాజీ మంత్రి పద్మసింహ పాటిల్ సోదరి. 1985లో పవార్ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన ఆమె, దశాబ్దాల పాటు బారామతిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన వదిన సుప్రియా సూలేపై పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికై క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. అజిత్ మరణం తర్వాత ఏర్పడిన సానుభూతి పవనాలు సునేత్రకు కలిసి వచ్చే అవకాశం ఉంది. పార్టీలోని ఎమ్మెల్యేలు, కేడర్ ఆమె నాయకత్వాన్ని ఆమోదించే అవకాశం ఎక్కువగా ఉంది.

కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ, సునేత్ర పవార్‌కు ఉన్న అనుభవం వారికి అసలే లేదు. దీంతో ఆమే పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు మరో చర్చ కూడా సాగుతున్నది. ఎన్సీపీ సరాసరి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)లో విలీనమవుతుందనే చర్చ కూడా జోరుగా సాగుతున్నది.