11-05-2025 12:09:24 AM
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయం(Vithaleshwara Temple)లో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహం(Akhanda Harinama Saptaham) శనివారం ముగిసింది. వారంరోజులపాటు ఆలయంలో హరినామ సంకీర్తనలతో భజనలు చేశారు. ముగింపు సందర్భంగా మహిళలు కళశాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భజన వార్కారీలు, భక్తులు పాల్గొన్నారు.