11-05-2025 12:03:53 AM
కోదాడ: స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ తెలిపారు. డైకిన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ శనివారం జరిగిన ప్రాంగణ ఎంపికలో 24 మంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వారికి వార్షిక వేతనం 2.4 లక్షలు ఉంటుందని కంపెనీ హెచ్ఆర్ సిద్ధార్థ , కిషోర్ మరియు విద్య సాగర్ తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు సెలెక్ట్ అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అభినందించడం జరిగింది. ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, సెలెక్ట్ అయిన విద్యార్థులను అభినందించారు. ఈ ప్రాంగణ ఎంపికలకు సెలెక్ట్ కావడానికి కృషి చేసిన ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ ఏజాజ్, రమేష్, స్రవంతిలను అభినందించడం జరిగింది.