03-01-2026 01:07:35 PM
ముత్తారం,(విజయక్రాంతి): పెరిక కుల సంఘం ముత్తారం మండల అధ్యక్షులుగా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన అక్కల నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందుల ఆనంద్ ఆయనకు శనివారం నియామకపు ఉత్తర్వులు అందజేశారు. తనను నియమించినందుకు పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందుల ఆనంద్, ఉపాధ్యక్షుడు అల్లం తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ దొమ్మటి రాజులకు అక్కల నారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కల నారాయణ మాట్లాడుతూ పెరిక కుల సంఘ అభివృద్ధికి, కుల బాంధవులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పెరిక కులస్తుల సంక్షేమం కోసం జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ లతో కలిసి పనిచేస్తూ ముందుకు సాగుతానన్నారు.