calender_icon.png 28 October, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలానా కింగ్ సంచలన స్పెల్

26-10-2025 12:00:00 AM

ఇండోర్, అక్టోబర్ 25 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సైతం కంగారూలు దుమ్మురేపారు. సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించారు. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ సంచలన స్పెల్‌తో సౌతాఫ్రికా కేవలం 97 పరుగులకే కుప్పకూలింది.

అలానా కింగ్ 7 ఓవర్లు వేసి 2 మెయిడెన్లు చేయడంతో పాటు 18 రన్స్‌కే 7 వికెట్లు పడగొట్టింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఇది నాలుగో అత్యుత్తమ ప్రదర్శన. తర్వాత 98 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో ఛేదించింది.