calender_icon.png 28 October, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాబాలో జోరుగా మద్యం అమ్మకాలు

22-10-2025 12:35:05 AM

అనుమతులు లేని అమ్మకాలు 

మంగపేట, అక్టోబర్21,(విజయక్రాంతి): మండలంలోని కమలాపురం, మంగపేట ప్రధాన జాతీయ రహదారి వెంబడి ఉన్న దాబా (రెస్టారెంట్) లలో అనుమతులు లేని మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా దాబాలలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధించారు. దాబాల నిర్వాహకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనివలన రోడ్డు ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి.

దాబాల్లో మద్యం సేవించి వాహనాలను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. దాబాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే కానీ అధికారులు నామమాత్రంగా పండగలకో, పబ్బాలకో వచ్చి హడావిడి చేసి నజరానా అందంగానే వెళ్ళిపోతారని గుసగుసలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దాబాలలో మద్యం అమ్మకాలను నిషేధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.