13-08-2025 12:00:00 AM
కరీంనగర్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మంగళవారం వారి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విఎన్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు.
తెలంగాణ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ తెలంగాణ రాష్ట్రం అన్ని రం గాలలో అభివృద్ధి సాధిస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న సీఎంకు శుభాకాంక్షలుతెలియజేశారు.