30-08-2025 06:13:38 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన ఎం.ఆరాధ్య, బి.అక్షిత్ ప్రధమ ద్వితీయ స్థానాలను నిలవడమే కాకుండా సైకిల్స్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 20 పైగా విద్యార్థులు చాలా చక్కటి వ్యాసాలను రూపొందించి ప్రోత్సాహక బహుమతులను గెలుచుకున్నారని తెలిపారు.
విద్యార్థులకు సైక్లింగ్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని, సైక్లింగ్ చేయడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎన్నో లాభాలు చేకూరుతాయని వారు చెప్పారు. చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బిఎస్ఏ హర్కులెస్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, హర్క్రైస్ కంపెనీ ప్రతినిధులు శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.