calender_icon.png 31 August, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్దు వాగు బ్రిడ్జి మరమ్మత్తులు చేపట్టాలి

30-08-2025 06:15:59 PM

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): అధిక వర్షాలతో తెగిపోయిన లింగంపేట్ మండలంలోని లింగంపేట్ కుర్దు వాగు బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామారెడ్డి ఎల్లారెడ్డి రూట్ లో ప్రధాన రహదారిపై గల ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఈ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రవాణాను పునరుద్ధరించడానికి ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఈ రూట్లో ప్రయాణించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి పునరుద్ధరణ పనులు చేయాలని ఆర్ అండ్ బి ఈఈ మోహన్ ను ఆదేశించారు. ఎల్లారెడ్డి డివిజన్లో దెబ్బతిన్న అన్ని రోడ్లు, బ్రిడ్జిల పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని, దెబ్బతిన్న ఇండ్లు, నష్టపోయిన పంటల వివరాలు త్వరగా సేకరించేలా పర్యవేక్షించాలని ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.