21-11-2025 12:55:10 AM
కొత్తపల్లి, నవంబరు 20 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థిని జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపి కయింది. ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 రాష్ట్రస్థాయి ఫుట్బా ల్ పోటీలలో పాఠశాలకు చెందిన ఎ.సహస్ర అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయి పో టీలకు ఎంపికయింది. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థినికి పుష్పగుచాన్ని అందజేసి అభినందించి, జాతీయస్థాయిలోనూ తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలనిఆకాంక్షించారు.