21-11-2025 12:56:56 AM
ముకరంపురా,నవంబర్20(విజయక్రాంతి)’వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో చికిత్స పొంది అర్హత గల వారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.నగర కాంగ్రెస్ కార్యాలయంలో 18 మందికి మొత్తం కలిపి 6 లక్షల 70 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటి వరకు 846 మందిని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా ఆదుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
లబ్ది దారులు జుట్టు లక్ష్మీనారాయణ,దారం స్రవంతి,దర్యపల్లి వాణి,పురుమల్ల శ్రీలత,ముజీబున్నీసా బేగం, యాసమీన్ ఫాదౌస్,గుర్రం సురేష్, యెన్నం మహిపాల్,సైద్ సుమర్,మహంకాళి ప్రసాద్,అహ్మద్ అలీ,భూలక్ష్మి,రాజేంద్ర ప్రసాద్, మాచర్ల శేఖర్,సుతారి మల్లేశం, సయ్యద్ మస్తాన్,గుంటి మల్లయ్య,కిష్టయ్య లకు చెక్కులుఅందజేశారు.