19-11-2025 12:00:00 AM
కొత్తపల్లి, నవంబరు 18 (విజయ క్రాంతి): కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు ప్రతిష్టా త్మక రామానుజన్ మ్యాథ్స్ ఒలంపియాడ్ తుది దశకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన బి.శ్రీక్షిత, జె. యశ్వంత్ రెడ్డి, జి. శ్రీయాన్ రెడ్డి, పి.సాద్విని, ఏ.రీతిక, జి. సహాంస్, ఎన్ సహార్ష్, ఏం శ్రేయాన్ కార్తీక్ లు సుదర్శన్ ఎంపికైనట్లు ఆల్ఫోర్స్ వి ద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు.
విజేతలందరికీ పుష్పగుచ్చాలను అందజేసి తుదిదశలోనూ కీర్తి పతాకాన్ని ఎగురవేయా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు