25-05-2025 12:02:56 AM
భారతదేశంలో ఉన్నత విద్య వి కాసాని, మైనారిటీ వర్గాల సాధికారత ప్రతీక ఆలీఘర్ ముస్లిం యూ నివర్సిటీ. ఇప్పుడీ వర్సిటీ 150 వసంతంలోకి అడుగు పెట్టింది. దేశంలోని పురా తన వర్సిటీల్లో ఆలీఘర్ వర్సిటీ ఒకటి. వర్సిటీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఎంతో మంది మేధావులు, విద్యావేత్తలను వర్సిటీ దేశానికిచ్చింది.
ఈ వర్సిటీని కేవలం ఒక విద్యాసంస్థలా చూడటంకంటే భారత ఉపఖండపు సామాజిక, విద్యా, రాజకీయ రంగాలను ప్రభావితం చేసిన కేంద్ర బిందువుగా చూడవచ్చు. కాలాగుణంగా సమా జంలో వస్తున్న మార్పులకు అద్దం పడేలా వర్సిటీలో పరిస్థితులు ఉండేవి. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం భారతీయ ముస్లిం సమాజం తీవ్ర గడ్డు పరిస్థి తిని ఎదుర్కొన్నది.
ఆధునిక విద్యకు దూ రంగా, సంప్రదాయ విద్యకే పరిమితమై, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడింది. ఈ పరిస్థితుల్లో, దూరదృష్టి గల సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ముస్లింల పునరుజ్జీవనానికి ఆధునిక విద్య ఒక్కటే మార్గమని గుర్తించారు. నాటి బ్రిటిష్ వి ద్యా విధానాన్ని అందిపుచ్చుకుంటూనే, ఇస్లామిక్ విలువలను, సంస్కృతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఆయన 1875లో “మహ్మదన్ ఆంగ్లో- ఓరియంటల్ కాలేజీ”ని స్థాపించారు.
ఇదే 1920లో ఆ సంస్థ ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా రూ పాంతరం చెందింది. సర్ సయ్యద్ అహ్మ ద్ ఖాన్ కేవలం ఒక విద్యాసంస్థను స్థాపించడమే కాకుండా, ముస్లిం సమాజంలోని మానవతా విలువలను, ఆధునిక ఆలోచనలను, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహిం చేలా పాఠ్యాంశాలకు పునాది వేశారు.
మత సామరస్యం చాటిచెప్పేలా..
వర్సిటీ తొలినుంచి మత సామరస్యానికి, సహనశీలతకు మారుపేరుగా ఉండే ది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలీఘర్ ఉద్యమాన్ని సైతం భుజానికెత్తుకున్నారు. తద్వారా ముస్లింలలో రాజకీయ, సామాజిక చైతన్యాన్ని రగిలించారు.
వర్సిటీలో 280 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. మొత్తం 12 ప్రధాన విభాగాలు ఉన్నాయి. అవి వ్యవసాయం, కళలు, ఆర్థిక, ఇంజినీరింగ్, సాంకేతిక, న్యాయ, జీవశాస్త్రం, మేనే జ్‌మెంట్, పరిశోధనలు, వైద్య, సామాజిక, మతశాస్త్రాలు, యూనాని వైద్య విభాగం. 150 సంవత్సరాలుగా వర్సిటీ దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో మేటిగానే నిలుస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను వర్సిటీలో ప్రవేశపెడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వస్తున్నది.
వర్సిటీలో కేవలం భారత్ నుంచే కాక ప్రపంచ నలుమూలల నుంచి విద్యార్థులు చదువుకునేందుకు వస్తారు. జ్ఞాన సముపార్జనకు ఇది ఒక విశ్వవేదికగా మారిందన డంలో సందేహం లేదు. వర్సిటీలో ఆచార్యులు, ఉపాచార్యలు కేవలం పాఠ్యపుస్త కాల్లో జ్ఞానాన్ని, విజ్ఞానానే కాకుండా సమ గ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యమిస్తారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను, సామాజిక బాధ్యతను పెంపొందిస్తారు.
వర్సిటీలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలను అధిరోహిం చారు. తద్వారా వర్సిటీకి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు ఇలా ఎందరో ప్రముఖులు వర్సిటీ నుంచే ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ పూర్వ విద్యార్థులు ‘ఆలీఘ ర్ స్పిరిట్’ నినాదంతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు.
వర్సిటీ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతీక అని చాటి చెప్తుంటారు. వర్సిటీలోని పరిధిలోని లైబ్ర రీ.. దేశంలోనే అతి అరుదైన లైబ్రరీల్లో ఒక టి. దీనిలో ఎన్నో పురాతన గ్రంథాలు అం దుబాటులో ఉన్నాయి. ప్రఖ్యాత రచయితలు, కవుల దస్తూరితో ఉన్న మాన్యువల్ స్క్రిప్ట్‌లు ఉన్నాయి.
వర్సిటీ పూర్వవిద్యార్థులు
సరిహద్దు గాంధీగా పేర్గాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్, మాజీ ఉపరా ష్ట్రపతి ముహమ్మద్ హమీద్ అన్సారీ, చరిత్రకారుడు ఈశ్వరీప్రసాద్, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా, మహాభారత్ సీరియల్ రచయిత డాక్టర్ రాహి మా సూమ్ రేజా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ, భారతీయ దౌత్యవేత్త ముహమ్మద్ యూనుస్, భారతీయ దౌత్యవేత్త, ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్, హిందీ సినీరంగ కళాకారుడు (మొఘల్ ఎ ఆజం ఫేమ్) కే ఆసీఫ్, క్రికెటర్, మాజీకెప్టెర్ లాలా అమరనాథ్, విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా,
ఆంగ్ల రచయిత రాజారావు, ఇస్లామిక్ స్కాలర్ షిబ్లీ నౌమాని, పాకిస్థాన్ మొదటి ప్రధానమం త్రి లియాకత్ అలీఖాన్, ప్రఖ్యాత ఉర్దూ కవి షకీల్ బాదయూని, హిందీ గేయ రచయిత జావేద్ అక్తర్, మాజీ కేంద్ర మంత్రి అష్రఫ్ ఫాతిమి, క్రికెటర్, మాజీ కెప్టెన్ ముస్తాక్ అలీ, భౌతికశాస్త్రవేత్త ప్రొఫెసర్ పీఎస్ గిల్,
ప్రొఫెసర్ మహమ్మద్ హబీబ్, చరిత్రకారుడు డాక్టర్ ఇర్ఫాన్ హబీబ్, ప్రఖ్యాత ఉర్దూ కవి కైఫీ అజ్మీ, హిందీ నటుడు దలీప్ తహీల్, హిందీ గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్‌పురి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ, హిందీ చిత్ర దర్శకుడు కేఏ అబ్బాస్.. ఇలా చెప్పుకొంటే పోతే ఎంతోమంది ప్రముఖులు ఆలీఘర్ వర్సిటీలో చదివిన వారే.
ఎన్నో సవాళ్లు.. మరెన్నో ఆటుపోట్లు..
వర్సిటీ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. రాజకీయపరమైన ఒత్తిళ్లకైతే లెక్కేలేదు. ఆర్థికపరమైన పరిమితులు కూడా వర్సిటీ వికాసానికి కొన్నిసార్లు అడ్డంకులుగా మారాయి. అయినప్పటికీ వెరవకుండా యాజమాన్యాలు ఒక్కో సమస్య నుంచి బయట పడింది. సామాజికంగా బాహ్యా సమాజంలో జరిగే మార్పుల ప్రభావం వర్సి టీపై ఎంతో ఉండేది. అయినప్పటికీ..
వర్సి టీ తన మౌలిక లక్ష్యాలను కాపాడుకుం టూ, దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించిన సందర్భాలు అనేకం భవిష్యత్తులో వర్సిటీ ఆధునిక విద్యా విధానాలను అందిపుచ్చుకుంటూ, పరిశోధనలకు మ రింత ప్రాధాన్యత ఇస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎదగాలనే ఆకాంక్ష ఇప్పుడు మరింత బలోపేతమైంది.
మారుతున్న ప్రపంచ అవసరా లకు తగ్గట్టుగా మరిన్ని కోర్సులు రావాలి. డిజిటల్ విద్య, నూతన ఆవిష్కరణలనూ వర్సిటీ ప్రోత్సహించాలి. సమాజానికి మ రింత చేరువయ్యేలా తన సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించాలి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కలలుగన్న విధంగా వర్సిటీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్‌నంబర్ 97694