14-01-2026 01:01:28 AM
పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం
౨౦న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): రాష్ర్టంలో త్వరలో జరగను న్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ర్ట ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు వేగవంతం చేశా రు. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓట ర్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించారు. రాష్ర్టంలోని ప్రధాన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓట ర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య పలు చోట్ల ఎక్కువగా ఉండటం విశేషం. రాష్ర్ట వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు.
అందులో పురుష ఓటర్లు 25,62 ,639 మంది ఉండగా, మహిళా ఓటర్లు 26,80,014 మంది, ట్రాన్స్‌జెండర్లు 640 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో నిజా మాబాద్ కార్పొరేషన్‌లో 60 వార్డుల్లో అత్యధికంగా 3,48, 051 మంది ఓటర్లు ఉన్నా రు. ఆ తర్వాత స్థానంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 వార్డులతో మొత్తం 3,40,580 మంది ఓటర్లు ఉన్నారు.
ఇందు లో పురుషులు 1,69,679 మంది కాగా, మహిళలు 1,70,858 మంది ఉన్నారు. ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. కాగా అత్యధిక ఓటర్లు ఉన్న మున్సిపాలిటీ జాబి తా సూర్యాపేట నిలిచింది. అక్కడ 1,08,848 మంది ఓటర్లు ఉన్నారు. అందు లో 56,664 మంది మహిళలు ఉండటం విశేషం. ఇక అత్యల్పంగా అమరచింత ము న్సిపాలిటీలో 9,147 ఓట్లు ఉన్నాయి.
కాగా, రాష్ర్ట ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబి తా తయారీ షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 12న తుది జాబితా ప్రచురణ పూర్తయి న నేపథ్యంలో జనవరి 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం ఇతర ప్రధాన పార్టీల నేతలు ఈనెల 16 నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. మరోవైపు ఓటర్లు తమ పేర్లను రాష్ర్ట ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.