calender_icon.png 25 May, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి జీపీఓ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

24-05-2025 07:30:37 PM

అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్..

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించనున్న గ్రామ పాలన అధికారుల నియామక పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్(Additional Collector Kishore Kumar) శనివారం ఒక ప్రకటన తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. చాణక్య హై స్కూల్ (రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో) లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సెల్‌ఫోన్‌ సహా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలని అదనపు కలెక్టర్ తెలిపారు.