calender_icon.png 25 May, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం

24-05-2025 07:27:30 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ జెడ్పీ హైస్కూల్లో ఐదు రోజులుగా ఎఫ్ఎల్ఎన్(FLN) కార్యక్రమంపై ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల ఎంఈఓ లు కాలేరు యాదగిరి, జంగా రూపారణి మాట్లాడుతూ... ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణను ఉపయోగించుకొని విద్యార్థుల్లో మంచి ఫలితాలు సాధించేలా బోధించాలన్నారు. అలాగే బడిబాటలో భాగంగా ఇళ్లిళ్లు తిరుగుతూ తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించి పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచాలన్నారు.

ఈ సందర్భంగా ఆర్పీలను మండల విద్యాశాఖ తరఫున ఎంఈవోలు కాలేరు యాదగిరి, జంగా రూపారణిలు ఘనంగా సన్మానించారు. శిక్షణ కార్యక్రమం శిక్షణ బాగా జరిగిందని, ఎమ్మార్పీలు చక్కగా బోధించారని, ఈ సందర్భంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీలు గనె యాదగిరి, ఏదునూరి అశోక్, బోరిగం రాములు, ఎన్నం భాస్కర్, వి. సత్యనారాయణ, మేకల సురేష్ నాయుడు, వెలమల భాస్కర్,  సూరం భాస్కర్, జి.మోహన్ కృష్ణ, జి కృష్ణ, ఎం.ఐ.ఎస్ కోఆర్డినేటర్ షేక్ ఖాదర్, సి.ఓ వెన్ను బిక్షపతి, సి.ఆర్.పి లు బి.స్వాతి, ఎస్కే సుల్తానా, ఇ. ఉదయ్, చీర మురళి, ధరావత్ రవి, నేరెళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.