17-12-2025 12:07:05 AM
163 గ్రామాలు, 1432 వార్డులకు ఎన్నికలు
సిద్దిపేట, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో 3వ దశ ముగింపుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలోనీ కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్, చేర్యాల, కొండపాక, దూల్మిట్ట, మద్దూరు, కుకునూరుపల్లి, కొమురవెల్లి మండలాల్లో మొత్తం 163 గ్రామాలు, 1432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
జిల్లా కలెక్టర్ హైమావతి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. పోలీసు కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగనున్నా గ్రామాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. రెండు దశలలో జరిగిన ఎన్నికలలో కోడ్ ఉల్లంఘించిన సంఘటనలో 33 కేసులు నమోదు చేశారు. అభ్యర్థులు, నాయకులు నిభందనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.