17-12-2025 12:08:44 AM
మునిపల్లి, డిసెంబర్ 16 :మండల కేంద్రమైన మునిపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన రాజగోని సౌంధర్య నరేందర్ గౌడ్, ఉప సర్పంచ్ ఇందూర్ పాండు, వార్డు సభ్యులు మంగళవారం హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు నివాసాల్లో వేర్వురుగా మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని వారు అభినందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారిని కలిసి వారిలో వార్డు సభ్యులు వడ్ల జగదీశ్వర్, బోయిని సుభాష్, చెవుల దుర్గయ్య, గణపురం నాగరాణి, సల్వంద్రి జోష్ణ, రొడ్డ కుమార్, ఇల్టం శోభా, వర్ణాసి చంద్రయ్య తదితరులు ఉన్నారు.