calender_icon.png 21 July, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు మరిచిన నేతలు

21-07-2025 01:32:21 AM

  1. తండాలకు సాగునీరు కరువు 

సాగునీరు లేక ఎండిన మొక్కజొన్న పంట 

బోరుమంటున్న రైతన్నలు 

బీడు భూములుగా 700 ఎకరాలు 

గోపాలపేట జూలై 20: వారి వారి అవసరాలకు ప్రజలను మభ్యపెట్టి కొండంత ధై ర్యం మేమున్నామంటూ హామీలపై హామీ లు గుప్పిస్తారు. వారి మాట నెరవేర్చుకున్నా క ససేమిరా అంటూ హామీలను మర్చిపోతారు. గిరిజనులు నేతలు ఇచ్చిన హామీలు ఏమైందంటూ ఎదురు చూస్తూ ఉన్నా సం ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేశంపేట తలుపునూరు తండాలలో జరిగిన వై నం.

రేవల్లి మండలం లోని తలుపును రు తండా, కేశంపేట తండా గిరిజనుల రైతుల పొలాలు, 600 నుండి 700 ఎకరాల పొలా లు ఉన్నాయి. గత ప్రభుత్వం లో మంత్రి నిరంజన్ రెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రధాన కాలువ నుండి పారుతున్న సాగునీరు తూడుకుర్తి సమీపంలో ఉన్న ౄ8 ప్రధాన కాలువ నుండి గిరిజన తండాలైన తలుపునూరు కేశంపేట రెండు గిరిజన తండాలకు తప్పకుండా సాగునీరు అందిస్తానని అప్పట్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చి మరిచారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఉన్న నేతలైన మా తండాలకు సాగునీరు అందిస్తారులే అనుకున్న గిరిజనులకు నిరాశ మిగిలింది.

అంతేకాకుండా ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ఎన్నికలకు ముందు గ్రామాలలో ప్రచారాలు బొమ్మరంగా చేపట్టారు. అప్పట్లోనే గిరిజన నాయకులకు గాని తండావాసులకు గాని హామీలు గుమ్మరిచ్చా రు. మీరంతా అధైర్య పడకండి అని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే తప్పకుండా తన సొంత ఖ ర్చుతో గాని తన వద్ద ఉన్న జెసిబి యంత్రాలతోకాల్వ నుండి తలుపునూరు కేశంపేట గి రిజన తండాలకు తప్పకుండా సాగునీరు అందించి తీరుస్తానని అప్పట్లో మేగా రెడ్డి గట్టిగా హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండు ఏళ్ళు గడుస్తున్నా గిరిజన తండాల వైపు మాత్రం చూడడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.

తమకున్న కొద్దిపాటి ఎకరాలలో సాగు చేసుకుందామంటే సాగునీరు లేకపాయే. అక్కడక్కడ వేసుకున్న మొక్కజొన్న పంట కూడా నీరు లేక ఎండ ముఖం పట్టిందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేతలంతా వారి అవసరం కోసం ప్రజల ను మోసం చేస్తూ హామీలు ఇస్తుంటారు కా నీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజ లు గుండెల్లో పెట్టుకుంటారని గిరిజనులు ఆరోపించారు.

ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే మేఘ రెడ్డి మా తండాలను సందర్శించి మా కు మా గిరిజన తండాకు సాగునీరు అందించాలని. సేవాలాల్ సేన జిల్లా కన్వీనర్ తిరు పతి నాయక్ కోరారు. ఏ నేతలైనా ఈ విషయంలో నాంచాడు ప్రయత్నం చేస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిరసనలు చేపడతామని డిమాండ్ చేశారు.