calender_icon.png 18 October, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల బంద్ కు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సంపూర్ణ మద్దతు

17-10-2025 10:22:06 PM

రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న బీసీ సంఘాలు బంద్ కు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు అంబటి జోజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు ఇచ్చిన స్టేకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 18న బంద్ జరపాలని బీసీ కుల సంఘాలు నిర్ణయించడం జరిగిందని, పార్టీ నాయకులు బంద్ ను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో విజయవంతం చేయాలని కోరారు.