17-10-2025 10:24:23 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్పీ గార్డెన్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎఐసీసీ పరిశీలకుడు నరేష్ కుమార్ హాజరయ్యారు. నూతనంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్ష పదవికోసం దరఖాస్తు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జెయింట్ కన్వీనర్ నాతరీ స్వామి డిసిసి అధ్యక్ష పదవీ కోసం ఏఐసీసీ పరిశీలకుడికి తమ దరఖాస్తును అందజేశారు. ఔత్సాహికులు మరి కొందరు కూడా డీసీసీ కోసం దరఖాస్తులు చేసుకొన్నారు.