02-01-2026 01:43:50 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): దేశాన్ని 2026లో ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దేందుకు ప్రధా ని నరేంద్రమోదీ ముందుకు సాగుతున్నారని, ఇందు లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. 2025లోనూ దృడమైన, దూరదృష్టితో అభివృద్ధిలో దేశం అన్ని రంగాల్లో వేంగంగా ముందుకు సాగిందని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ ప్రస్తుతం 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించిందని గుర్తుచేశారు.
త్వరలోనే మూడో స్థానానికి చేరుకునే దిశగా దేశంగా వేగంగా ముందుకెళ్లుతోందని చెప్పారు. 2026లో మనందరం ‘నేషన్ ఫస్ట్’ అనే భావనతో మన జీవితాన్ని అంకితం చేస్తూ వాజ్‌పేయి చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు.