calender_icon.png 22 January, 2026 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డిపేట్‌లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ సర్వే

22-01-2026 12:35:22 AM

నాగిరెడ్డిపేట్, జనవరి 21 (విజయ క్రాంతి): ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగిరెడ్డిపేట మండలంలో సర్వే నిర్వహించినట్లు నాగిరెడ్డిపేట మండల రేంజి ఆఫీసర్ వాసుదేవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్వో వాసుదేవ్ మాట్లాడుతూ.. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ సర్వే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆరు రోజులు నిర్వహించడం జరుగుతుందని మొదటి మూడు రోజులు మాంసాహార జంతువులను తర్వాత మూడు రోజులు శాఖాహార జంతువులను పరిగణించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.