06-08-2025 12:05:59 AM
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ నారాయణ
గద్వాల, ఆగస్టు 05 ( విజయక్రాంతి) : ఖరీఫ్ -2025 సీజన్ త్వరలో ప్రారంభం కానునందున కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పరికరాలు సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్మీ నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబరులో ఖరీఫ్ -2025 సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్న అవసరమైన పరికరాల పరిశీలన, అవసరమైన పరికరాల ప్రతిపాదనలపై సంబంధిత శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్స్, మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ తూకాలు, ప్యాడి క్లీనర్లు, ప్యాడి డ్రయర్లు, ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్లు, క్యాలిఫార్స్, హస్క్ రిమూవర్లు వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ఇంకా అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన పరికరాల వివరాలను 2 రోజుల్లో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారికి తెలియజేయాలని అధికారులను ఆదే శించారు.
రైతులకు ఖరీఫ్ సీజన్కు ప్రకటించినున్న కనీస మద్దతు ధరలపై స్పష్టమైన అవగాహన ఏ.ఈ.ఓ. ల ద్వారా కల్పించాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న పరికరాలు త్వరితగతిన మార్కెట్ కమిటీలకు తిరిగి అప్పగించాలని సంబంధిత శాఖ అధికారులు కో - ఆపరేటివ్, డి ఆర్ డి ఓ శాఖలకు ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ , జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి స్వామి కు మార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల , జిల్లా కోపరేటివ్ అధికారి శ్రీనివాసరావు , డి ఆ ర్ డి ఓ ఎ ఓ సిద్దయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.