calender_icon.png 26 September, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపు

26-09-2025 12:44:38 AM

  1. డ్రా తీసిన కలెక్టర్ కుమార్ దీపక్

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

మంచిర్యాల, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : జిల్లాలో ఏ4 మద్యం దుకాణాలు 73 ఉండగా ఇందులో డ్రా పద్ధతిన ఎస్సీలకు పది, ఎస్టీలకు ఆరు, గౌడ కులస్తులకు ఆరు మద్యం దుకాణాలను రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు.

గురువారం కలెక్టరేట్ మీటిం గ్ హాలులో జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధ అధికారి నందగోపాల్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి దుర్గా ప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి గంగారాంలతో కలిసి మద్యం షాపుల రిజర్వేషన్ డ్రాను కలెక్టర్ కుమార్ దీపక్ తీసి ప్రకటించారు. 

జిల్లాలోని 73 ఏ4 మద్యం దుకాణాలలో రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రి మున్సిపల్ ప్రాంతంలో ఆరు మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన కాకుండా షెడ్యూల్ తెగల అభ్యర్థులకు కేటాయించారు. ఎస్సీలకు గెజిట్ నెంబర్ 11, 22, 26, 36, 42, 45, 61, 64, 65, 67 నంబర్లు గల దుకాణాలను కేటాయించగా, గౌడ కులస్తులకు 9, 13, 29, 31, 37, 59 నంబర్లు గల దుకాణాలను రిజర్వేషన్ ప్రకారం డ్రా పద్ధతిన కేటాయించారు. మిగితా 51 దుకాణాలు ఓపెన్ కేటగిరిలో ఉన్నాయి. 

జిల్లాలోని 73 మద్యం దుకాణాలకు ఈ నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నందగోపాల్ తెలిపారు. అక్టోబర్ 18వ తేదీ వరకు ధరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 23న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్దతిలో లైసెన్స్ లు అందజేత, 24, 25 తేదీల్లో ఆర్‌ఎస్‌ఈటీ చెల్లించేందుకు అవకాశ ఉంటుందన్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి లక్కీ వరించిన వారు కొత్త దుకాణాలు ప్రారంభించవచ్చన్నారు.