calender_icon.png 13 August, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నోటిఫికేషన్‌లోపు మహిళా కాంగ్రెస్ కమిటీలన్నీ పూర్తి చేయాలి

13-08-2025 12:00:00 AM

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి

కొత్తపల్లి, ఆగస్టు 12 (విజయ క్రాంతి): ఎన్నికల నోటిఫికేషన్ లోపు మహిళా కాంగ్రెస్ కమిటీలన్నీ పూర్తిచేయాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం ఇందిరా భవన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా స్థాయి, మండల గ్రామ, బ్లాక్ కమిటీలు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ లోపు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి మహిళకు వివరించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం కొత్తగా పది లక్షలకు పైగా రేషన్ కార్డులు అందజేయడంతో పాటు ,ఉచిత బస్సు, ఉచిత కరెంటు,మరియు సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్న విషయాన్ని గర్వంగా ప్రచారం చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలకు సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే దిశగా కష్టపడాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గాజుల సుకన్య రాష్ట్ర మహిళా కార్యదర్శి వంగల కళ్యాణి,కరీంనగర్ జిల్లా పట్టణ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు,కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.