calender_icon.png 29 January, 2026 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు: ఎస్పీ జానకీ

29-01-2026 12:34:48 AM

నిర్మల్, జనవరి ౨౮ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును నిర్వహిస్తున్నట్టు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బుధవారం జిల్లాలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి పోలీస్ పరంగా చేపట్టవలసిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఉల్లంఘిస్తే చర్యలు తప్పమన్నారు. నామినేషన్ సందర్భంగా ర్యాలీలు నిర్వహించవద్దని, అసత్యపు ప్రచారాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీలు ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి ఎన్నికల ప్రచారం చేపట్టి వద్దన్నారు. ప్రతి నామినేషన్ కేంద్ర వద్ద పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, ఎస్సై గణేష్ సిబ్బంది ఉన్నారు.