10-12-2025 01:31:45 AM
విగ్రహావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, డిసెంబర్ 9(విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘ నంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సం దర్భంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.
విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతంతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగింది. కలెక్టరేట్ ను సందర్శించే ప్రజలకు, అధికారులకు ఈ విగ్రహం ప్రేరణగా నిలుస్తోంది. తెలంగాణ గౌరవం, సాంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. వి. గణేష్, డిఆర్డివో మేన శ్రీను, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, డిటిఓ శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులతో పాటు సిబ్బందిపాల్గొన్నారు.