calender_icon.png 22 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలన్నీ అమలు చేయాలి

22-11-2025 01:39:35 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

 కొమురవెల్లి, నవంబర్ 21; కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొమరవెల్లి మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలను, కార్యకర్తలను కలుస్తూ, సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీటిని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రజా క్షేత్రంలో ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకొని, సాధ్యమైనంతవరకు సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన అభివృద్ధే తప్ప, కొత్తగా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదన్నారు. తమ ప్రభుత్వ హాయంలో మంజూరైన పనులే ఇప్పటివరకు పూర్తి కాలేదు అన్నారు.

బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశంలో మరల తానే దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాలలో పర్యటించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు అంకుగారి శ్రీధర్ రెడ్డి, వక్లాభరణం నరసయ్య పంతులు, పబ్బోజు విజయేందర్, గీస బిక్షపతి, ముత్యం నరసింహులు, గొల్లపల్లి కిష్టయ్య, సార్ల కిష్టయ్య, సిల్వర్ సిద్ధప్ప, ఎరుపుల మహేష్, పచ్చిమడ్ల స్వామి,తదితరులు పాల్గొన్నారు.