22-11-2025 01:55:57 AM
కాంగ్రెస్ ఎంపీ చామల
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ‘ పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది.. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ’ అని చామల విమర్శలు చేశా రు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ టైం లో ఫాం హౌస్ పాలన తప్ప.. ప్రజా పాలన చే యలేదన్నారు.
కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కుటుంబాన్ని బ్లేమ్ చేయడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదని చామల మండిపడ్డారు. అసలు రేవంత్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటని.. ఆయన కు టుంబంలో ఎంతమంది రాజకీయాల్లో ఉ న్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇంట్లో లాగా.. రేవంత్ ఇంట్లో ఎవరికీ పదవులు లేవు కదా ..? అని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు మంచి చేయలేదు.. మేము చేస్తుంటే చేయనియ్యట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.