calender_icon.png 22 November, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్య కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ

22-11-2025 01:38:20 AM

- జిల్లా మత్స్య సంఘం డైరెక్టర్ చిలుముల నరహరి 

 కొండపాక, నవంబర్ 21:కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో మత్స్య కార్మికులు, ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జెండా ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా మత్స్య కార్మిక సంఘం డైరెక్టర్ చిలుముల నరహరి మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సంక్షేమ పథకాలను మచ్చ కార్మికులకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండలం ముదిరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శి పాతాళ కొండలు, దుద్దెడ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మిద్దె శివకుమార్, ఉపాధ్యక్షులు జగపతి నాగులు ప్రధాన కార్యదర్శి గొడుగు కనకయ్య తదితరులుపాల్గొన్నారు.