calender_icon.png 22 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

22-11-2025 01:55:17 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్21(విజయక్రాంతి): గత కొన్ని ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  శుక్రవారం కుమ్రంభీం జిల్లా  కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి. సురేందర్ రావు, పర్వతి రాజశేఖర్ మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్య పెండింగ్‌లో ఉందని, గతంలో హెల్త్ కార్డులు ఇచ్చినా అవి ఆసుపత్రులలో అనుమతించడం లేదన్నారు. 

అక్రెడిటేషన్‌ల కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర గడిసినా నూత న కార్డులు మంజూరు చేయడం లేదని, కొత్త కార్డులు ఇవ్వాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు ఫిం చన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు నీలి సతీష్, ఘనపురం మహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుల్లూరి సంతోష్, ఉపాధ్యక్షులు ఏం. రవి, నాయకులు లక్ష్మన్, నాగేందర్, కిరణ్, అబ్దుల్ సమీర్, రాజు పాల్గొన్నారు.