22-11-2025 01:39:52 AM
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : ప్రపంచంలో అగ్రస్థానమే లక్ష్యం గా భారత్ ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన తోనే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయా లు తీసుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగానే ఆత్మనిర్భర్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమం చేపట్టినట్లు రాంచందర్‌రావు వివరించారు.
బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ అభియ న్ రాష్ర్టస్థాయి వర్క్‌షాప్‌లో రాంచందర్‌రావు మాట్లాడారు. దేశం ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మనిర్భర్ భారత్‌గా ఎదగా లనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మనదేశంలో తయారయ్యే వస్తువులను మనమే వాడాలన్నారు.
అవసరమైన వస్తువులను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లక్షలాది, కోట్లాది రూపాయలు బయటకు వెళ్లిపోతాయి. అదే మనమే ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తే ఆ సంపద దేశంలోనే ఉంటుంది. ప్రజలు విదేశీ వస్తువుల మోజులో పడకుండా స్వదేశీ వస్తువుల తయారీని ప్రోత్స హించాలని రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు.
బీజేపీలో చేరిన వాల్మీకి నాయకులు
వాల్మీకి మెతార్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌లాల్ శుక్రవారం బీజేపీలో చేరారు. ఈయ నకు పార్టీ చీఫ్ రాంచందర్‌రావు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ వాల్మీకి సమాజం ఎస్సీల్లో అత్యంత ఆచారవంతమైన, కఠినంగా హిందూ సంప్రదా యలను పాటించే సమాజమన్నారు. గతంలో అనేక ఒత్తిడులు, బలవంతపు చర్యలు ఎదురైనా తమ ధర్మాన్ని మార్చుకోకుండా హిందూమతాన్ని అంచెలంచెలుగా కాపాడారని ఆయన కొనియాడారు.