calender_icon.png 27 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ జిల్లా అధ్యక్షుడిని తొలగించాలని డిమాండ్

27-12-2025 12:24:24 AM

రామరాజుపై దాడికి నిరసనగా బీసీ సంఘాల ధర్నా

నల్గొండ టౌన్, డిసెంబర్ 26: భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంట్ కో కన్వినర్ పిల్లి రామరాజు యాదవ్‌పై గురువారం బిజెపి జిల్లా కార్యాలయంలో నాగం వర్షిత్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం స్థానిక గడియారం సెంటర్లో యాదవ సంఘం, బిసి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్  మాట్లాడారు. యాదవులపై దాడి చేస్తే సహించేది లేదని వెంటనే బిజెపి అదిష్టానం జిల్లా అధ్యక్ష పదవి నుండి నాగం వర్షిత్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు.

బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు, దుడుకు లక్ష్మీనారాయణ, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్, మాట్లాడుతూ.. నాగం వర్షిత్ రెడ్డి పిల్లి రామరాజు యాదవ్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక దాడులు చేయించడం దుర్మార్గమన్నారు జాతీయ పార్టీలో దాడులు చేసేందుకు అధిష్టానం జిల్లా అధ్యక్షునిపై చర్యలు తీసుకోవాలని కోరారు చర్యలు తీసుకోకపోతే బిజెపిలో పెద్ద నాయకుల సహకారం ఉందని భావించాల్సి ఉంటుందన్నారు. వర్షిత్ రెడ్డి ఫ్లెక్సీలను దహనం చెశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మిర్యాల యాదగిరి, బీసీ జేఏసీ నాయకులు గజ్జి అజయ్ యాదవ్, అల్లి వేణు యాదవ్, నరేష్ గౌడ్, రేణుక, లక్ష్మి, గట్టిగొర్ల సత్యనారాయణ యాదవ్ 

యాదవ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లా కోటేష్ యాదవ్, గుండబోయిన సురేష్ యాదవ్, కుంటి గొర్ల లింగయ్య యాదవ్, బత్తుల నరేష్ యాదవ్, దొండ మల్లేష్ యాదవ్ పేరం మల్లేష్ యాదవ్ లతో పాటు ఎస్సీ,ఎస్టీ, బీసి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు