calender_icon.png 8 September, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుర్జిత్‌నగర్ గుడిసెవాసులందరికీ పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

02-09-2025 12:00:00 AM

హన్మకొండ సెప్టెంబర్01. (విజయ క్రాంతి): కాజీపేట సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో  మండలంలోని 31 వ డివిజన్ న్యూ శాయంపేట సుర్జిత్ నగర్ లో కారు ఉపేందర్ అధ్యక్షతన కాలనీవాసులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన  చుక్కయ్య మాట్లాడుతూ  కాజీపేట మండలంలోని 31 డివిజన్ న్యూ శాయంపేట ప్రాంతంలోని సూర్జిత్ నగర్ లో జీవో నెంబర్ 58 ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, పట్టా లేకున్నా ఇంటి నెంబర్ కలిగి ఉన్న ప్రతి స్థలానికి ఇల్లు మంజూరు చేసే విధంగా ఈ డివిజన్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కమిటీకి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవా ల్సిందిగా సిపిఎం పార్టీ కోరుతుందన్నారు.

లేనిచో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యే వరకు కాలనీవాసులు అందరినీ ఐక్యం చేసి రాబోవు కాలంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.  పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య,  జంపాల రమేష్, వంగ సదానందం, దారుణ ప్రభాకర్, పెండ్యాల లక్ష్మణ్ ఇనుముల వనమాల, షర్ఫుద్దీన్, కావట్టి కేతమ్మ, పిండి జజ్జాలు కొమరమ్మ, ప్రశాంత్ బిక్షపతి నేరేళ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.