17-05-2025 07:07:32 PM
ఖమ్మం (విజయక్రాంతి): బోనాల నిలయం ఎన్నారై ఫౌండేషన్ కార్యాలయంలో శనివారం ఆరుగురు దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(District Collector Muzammil Khan) వీల్ చైర్ లను అందజేశారు. వికలాంగులకు వారికి మెరుగైన జీవన సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తున్న ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ యూఎస్ఏ అధ్యక్షులు శ్రీ బయ్యన బాబురావు, ఎన్నారై ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ బోనాల రామకృష్ణ, కార్యదర్శి బండి నాగేశ్వరరావు, పసుమర్తి రంగారావు, వాసిరెడ్డి శ్రీనివాస్, బత్తుల రాజేశ్వరి, సునీత, దొడ్డపనేని కృష్ణారావు, అర్జునరావు, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.