11-09-2025 12:26:04 AM
ఎమ్మెల్యేను కోరిన సొసైటీ సంఘం నేతలు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 10, (విజయక్రాంతి)ఉపాధ్యాయ సొసైటీకి ఇంటి స్థలాలు కేటాయించుటకు ముఖ్యమంత్రిని ఒప్పించి, ఉపాధ్యాయులకు ఇండ్లప్లాట్లు అందించుటకు కృషి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ను ఉపాధ్యాయ సంఘం సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు డి వెంకటేశ్వరరావు, బి రవి కోరారు. బుధవారం కొత్తగూడెంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
జిల్లా ఉపాధ్యాయులకు గృహనిర్మాణానికి ఇక్కడి ప్రత్యేక పరిస్థితులు /చట్టాలు అడ్డంకిగా మారినందున ప్రభుత్వ నామినల్ ధరతో ఇండ్లప్లాట్లు ఇచ్చుటకు ప్రభుత్వ స్థలమును కేటాయించుటకు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలనీ వారు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను నివేదించి, ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు .
ఈ ప్రాంతంలో గృహనిర్మాణానికి కావలసిన టైటిల్ డిడ్ లు సరిగా లేకపోవడం ,అనుమతులు రాక ,బ్యాంకు లోన్ అందక జిల్లాలో పనిచేస్తున్న చాలా మంది ఉపాధ్యాయులు వలస వెళ్లి ఖమ్మం ఇతర ప్రాంతాలలో గృహనిర్మాణాలు చేపడుతున్నారని ఇది జిల్లా అధివృద్దికి అవరోదామని ఈ సమస్యకు తప్పకుండ పరిష్కరించుటకు గౌరవ కలెక్టర్ గారితో చర్చించి బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపినారు .
ఉపాధ్యాయ సొసైటీ ఏర్పాటు చేసి సమస్య సాధనకు కృషి చేస్తున్న జిల్లా నాయకత్వానికి అభినందనలు తెలిపినారు . ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి V. వెంకటేశ్వర రెడ్డి ,సంగమేశ్వరరావు గారు ,B బాలాజీ గారు ,v శ్రీనివాస్ రావు గారు ,B సీతారాం గారు ,కామేష్ గారు తదితరులుపాల్గొన్నారు