11-09-2025 12:27:37 AM
* బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు
మణుగూరు, సెప్టెంబర్10 , (విజ యక్రాంతి) : అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ను నమ్మి ప్రజలు ఓట్లు వేసిమోసపోయారని, ఇప్పుడు ప్రజలు అది గ్రహిస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం పట్టణం లోని పార్టీ కార్యాలయంలోనిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.
అధికారాన్ని చేజిక్కిం చేందుకుఅలవి కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలుచేయడానికి అపసోపాలు పడుతుందని విమర్శించారు. ఏరుదాటేదాక ఓడ మల్లన్న.. ఏరుదాటాక బోడి మల్లన్న అన్న చందంగా మాటలతో గారడీ చేసిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తమతప్పులను, వైఫ ల్యాలను కప్పిపుచ్చు కోవడం కోసం, పథకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కెసిఆర్, కేటీఆర్ పార్టీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ స ర్కార్కే దక్కుతుందని ఎద్దేవాచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు తల మీదకు వస్తుండటంతో కొత్తగా మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్కు కాంగ్రస్ తెరలేపుతుందని, కానీ బిఆర్‌ఎస్ ముందు అవి పనిచేయవన్న సంగతి వారికి అర్థంకావట్లే దన్నారు. కాళేశ్వరం,విద్యుత్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్ర తినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుం టూ పబ్బం గడుపుతున్నారని ధ్వజ మెతా రు.
కేవలం కేసీఆర్ను టార్గెట్గా చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభు త్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్షణ మే మర మ్మతులు చేపట్టాలన్నారు. కేటీఆర్ పై కేసు, అరెస్ట్ అంటూ రోజుకో ప్రచారంతో కాంగ్రెస్ ప్రభుత్వం క్యాడర్ ను గందరగోళానికి గురిచేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తుంద ని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కుర్రీనాగేశ్వ రావు, కుంట లక్ష్మణ్, నాయకులు పో షం నరసింహరావు, ము త్యం బాబు, అడపా అప్పారావు, నూకారపు రమేష్, యా దగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.