calender_icon.png 26 September, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో లాటరీ ద్వారా వైన్స్ షాపుల రిజర్వేషన్ కేటాయింపు ఖరారు

26-09-2025 12:16:16 AM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, సెప్టెంబర్ 25విజయక్రాంతి లాటరీ పద్దతి ద్వారా జిల్లాలో వైన్స్ షాపు రిజర్వేషన్ కేటాయింపు ఖరారు చేసామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వైన్స్ షాపుల  రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను గురువారం కలెక్టరేట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* జిల్లాలో ఉన్న 74 ఏ4 వైన్స్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు గౌడ కులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు  రిజర్వ్ చేసి సదరు షాపులను  లాటరీ ద్వారా  కేటాయిస్తున్నామని, పారదర్శకంగా  రిజర్వ్ వైన్ షాపులు కేటాయించే విధంగా మొత్తం ప్రక్రియను వీడియోగ్రాఫీ చేయడం జరిగిందని తెలిపారు. మధ్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్థులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5%  రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వం గౌడ కులస్థులకు 13 షాపులు, ఎస్సీలకు 8 షాపులు కేటాయించిందని తెలిపారు. జిల్లాలో గౌడ కులస్థులకు షాపు నెం. లను, ఎస్సీలకు షాపు నెం. లను లాటరీ ద్వారా  కలెక్టర్ ఎంపిక చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా అభ్కారీ శాఖ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి  రంగారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి మండల రవీందర్, ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.