05-11-2025 01:01:19 AM
-మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్
-సీఎస్ ఉత్తర్వులు
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): రాష్ర్ట క్యాబినెట్‌లో కొత్త గా చేరిన మంత్రి అజారుద్దీన్‌కు ప్రభు త్వం శాఖలు కేటాయించింది. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ శాఖలను కేటాయిస్తూ మంగళవారం ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ ఆమోదంతో శాఖలు కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్రస్తు తం ముఖ్యమంత్రి వద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, జనరల్ అడ్మిని స్ట్రేషన్, లా అండ్ ఆర్డర్‌తోపాటు ఏ మం త్రికి కేటాయించని ఇతర శాఖలు ఉన్నా యి.
వీటిలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ను అజారుద్దీన్‌కు కేటాయించారు. ఇక గత జూన్ నెలలో మంత్రివర్గలో చేరిన అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖలను ప్రభుత్వం అప్పగించింది. తాజాగా అడ్లూరి వద్ద ఉన్న మైనార్టీ శాఖ ను అజారుద్దీన్‌కు అప్పగించింది. కాగా, గత శుక్రవారం మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్.. హోంశాఖ కోసం ప్ర యత్నించారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు కేటాయించబోయే పోర్ట్ పోలియోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించుతూ అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది.