calender_icon.png 5 November, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకా ఎన్నాళ్లీ ఎదురుచూపు?

05-11-2025 01:02:03 AM

  1. సంక్షేమ గురుకులాల్లో అందని సరుకుల బిల్లులు

ఈ విద్యా సంవత్సరం ఖరారుగాని టెండర్ల ప్రక్రియ

అప్పుల కుంపటిలో చిరు వ్యాపారులు

నిర్మల్, నవంబర్ 4 (విజయక్రాంతి): పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకులాలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. పేరుకు సంక్షేమ గురుకులాలైన చదువు బాగున్నప్పటికీ గురుకులాల్లో సమస్యలు ఎటు ఉపా ధ్యాయులను అటు కాంట్రాక్టర్లను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి.

నిర్మల్ జిల్లాలో అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లో కార్పొరేట్ చదువులు అందించాలని లక్ష్యంతో పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో బీసీ గురుకులాలు ఎనిమిది ఉండగా ఎస్సీ గురుకులాలు ఆరు మైనార్టీ గురుకులాలు 6 ఉన్నాయి. ఒక్కొక్క గురుకులంలో పదో తరగతి వరకు ఉన్న గురుకులంలో 480 మంది విద్యార్థులు చదువుకుంటుండగా ఇంటర్ ఉన్న గురుకులాలకు 640 మంది డిగ్రీలు 120 మంది విద్యా ర్థులు చదువుతున్నారు.

జిల్లాలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించగా ప్రస్తుతం బీసీ గురుకులాలు 7 అద్దె భవనంలోని నిర్వహిస్తున్నారు రెండు అధ్య భవనాలు ఉండగా మిగతా 5 సొంత భవనాలు ఉన్నాయి మైనార్టీ గురుకులకు ఒకటి మాత్రమే అద్దె సొంత భవనం ఉండగా మిగతాయి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వం ప్రతినెల అద్దెను చెల్లించకపోవడంతో ఐదు నెలల నుంచి అద్దె రాకపోవడంతో యజమానులు భవనం కాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు అద్దె భవనాలు కావడంతో అరకురనివస్తులు గ్రౌండ్ లేకపోవడం సరైన మరుగుదొడ్లు మూత్రశాలలు డైనింగ్ హాలు ఇతర సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

అందని సరకురా రవాణా బిల్లులు

సంక్షేమ హాస్టల నిర్వహణలో ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేయకపోవడంతో సరకు రవాణా దారులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. 2024 25 విద్యా సంవత్సరం గాను జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ గుడ్లు చికెన్ కూరగాయలు పండ్లు పాలు మటన్ వంటవస్తులకు కిరణ సామాగ్రికి సరుకుల సరఫరాకు టెండర్లను ఖరారు చేసింది.

క్యాటరింగ్ కు ఒక్కొక్క విద్యార్థికి ఏడు రూపాయల నుంచి తొమ్మిది రూపాయల వరకు. కూరగాయలకు కేజీకి 24 రూపాయలు గుడ్లకు ఐదు రూపాయలు మటన్కు 480 నుంచి 520, చికెన్ కు 170 నుంచి 190 పనులకు 30 నుంచి 40 రూపాయలు ధరలను ఖరారు చేసి టెండర్దారులకు అప్పగించింది సరుకులు రవాణా చేస్తే ప్రభుత్వం నిర్దేశించిన ధర మేరకు ప్రతినెల సరఫరా అయ్యే సరుకులు ఆధారంగా బిల్లలు ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం నిధులను విడుదల చేయవలసి ఉంది. 

హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రజాపాలన ప్రభుత్వం ఇటీవలే కొత్త మేలును ప్రకటించి పోషక విలువలు గల ఆహారం నాణ్యమైన భోజనం అందిస్తుంది అయితే వాటికి అవసరమయ్యే సరుకులను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు మాత్రం గత ఐదు నెలల నుంచి బిల్లులు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరుకుల సరఫరా క్యాటరింగ్ నిర్వహణకు ప్రతిరోజు సొంత డబ్బులను పిల్లల సంక్షేమం కోసం తాము ఖర్చు చేస్తున్న తమకు ప్రభుత్వం చెల్లించే బిల్లులు రాకపోవడంతో ప్రతి నెల అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని జిల్లాకు చెందిన గురుకుల పాఠశాలల టెండర్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ధరలు పెంచితేనే ప్రయోజనం

సంక్షేమ గురుకుల విద్యాలయాలు 2024 25 విద్యా సంవత్సర సంబందించిన సరుకుల రవాణా క్యాటరింగ్ టెం డర్లను ఖరారు చేయగా అది గత విద్య సంవత్సరమే ముగిసింది మే నెలలో కొత్త టెండర్లు వేసి కొత్త ధరలను ప్రకటించవలసిన ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్లు ఈ విద్యా సంవత్సరం ఖరారు చేయలేదు దీంతో పాత కాంట్రాక్టర్లకు పాత టెండర్ల ధరలు మాత్రమే చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త టెండర్లు ఖరారు అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త రేట్లు వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కొత్త టెండర్లు ఖరారు చెప్పగా బకాయిలు కూడా చెల్లించకపోవడంతో నిర్మల్ జిల్లా లో గురుకుల సంక్షేమాలకు సరుకులు సరఫరా చేస్తున్న సుమారు 150 మంది బిల్లులు రాక సరుకులు కొనుగోలు చేసే శక్తి లేక అప్పులు తీర్చి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి నాలుగుసార్లు తీసుకెళ్లినప్పటికీ తమకు ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని ఉద్దేశంతో క్యాటరింగ్ టెండర్ను దక్కించుకున్న. నాలుగు నెలల నుంచి ప్రతినెల 1,20 లక్షల బిల్లు రావాల్సి ఉండగా పెండింగ్లో ఉంది. వంట మనుషులు సిలిండర్లా ఖర్చు జీతాలకు సొంత జేబులు నుంచి ఖర్చు చేయవలసిన రావడంతో ప్రభుత్వ బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.

 రమేష్, క్యాటరింగ్ నిర్వాకులు

10% రేట్లు పెంచాలి

సంక్షేమ గురుకుల పాఠశాల తో పాటు జనరల్ గురుకులాల్లో సరుకులు రవాణా చేస్తున్న క్యాటరింగ్ చేస్తున్న వారిని ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించి రేట్లు పెంచాలి. గత సంవత్సరం జిల్లా అధికారులు ప్రకటించిన రేట్ల కంటి 10% రేట్లు పెంచితేనే తమకు గిట్టుబాటు అవుతుంది మార్కెట్లో ఖర్చులన్నీ పెరిగినాయి జీతాలు పెరిగినయి రేట్లు మాత్రం పాతయి చెల్లించడం వల్ల మేం నష్టపోతున్నాం.

 అంగ జగదీష్, మటన్ వ్యాపారి

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

నిర్మల్ జిల్లాలో సంక్షేమ గురుకులాల్లో సరుకులు కూరగాయలు పండ్లు సరఫరా చేసే వారికి పెరిగిన ధరల కనుగుణంగా రేట్లు పెంచాలని ఇప్పటికే జిల్లాలో జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. నిజామాబాద్ జగిత్యాల్ తదితర జిల్లాలో 15% రేట్లు పెంచి కొత్త రేట్ల ప్రకారం పాత టెండర్దారులకు అనుమతి ఇచ్చారు ఇక్కడ కూడా దాన్ని అమలు చేస్తేనే మాకు జరిగే నష్టం కొంతమేరకు తీరుతుంది.

 కిరణ్ కుమార్, గుడ్ల వ్యాపారి